బీసీ వెల్ఫేర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేస్తున్నామని అన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల తొలగింపు కాదు...పింఛన్ల తనిఖీ జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్.ఆర్.శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.