ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవాళే మమత మెషినరీ షేర్ల కేటాయింపు.. మీ స్టేటస్ తెలుసుకోండిలా.. జీఎంపీ ఎంతుందంటే?

business |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 10:42 PM

మమత మెషినరీ పబ్లిష్ ఇష్యూ కోసం బిడ్లు దాఖలు చేసిన వారికి అలర్ట్. ఈ ఐపీఓ డిసెంబర్ 19వ తేదీన సబ్ స్క్రిప్షన్ కోసం రాగా డిసెంబర్ 23 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తంగా 194 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రావడం గమనార్హం. బిడ్లు దాఖలు చేసిన వారు షేర్ల కేటాయింపు కోసం చూస్తున్నారు. ఈ ప్రక్రియ ఈరోజే అంటే డిసెంబర్ 24నే పూర్తి కానుందని సమాచారం. భారీగా బిడ్లు దాఖలైన క్రమంలో తమకు షేర్లు వస్తాయో రావోనని ఉత్కంఠగా నెలకొంది. మరి ఈ ఐపీఓ కోసం దరఖాస్తు చేసిన వారు తమ స్టేటస్ ఆన్‌లైన్ ద్వారానే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


రిజిస్ట్రార్ వెబ్‌సైట్ ద్వారా


మమత మెషినరీ పబ్లిక్ ఇష్యూకు లింక్ ఇన్ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో ఐపీఓ సెక్షన్‌ లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేయవచ్చు.


ఐపీఓ స్టేటస్ సెక్షన్‌లోని ఆప్షన్లలో సెలక్ట్ ఐపీఓ దగ్గర డ్రాప్ డౌన్ జాబితాలో కనిపించే మమత మెషినరీ కంపెనీ పేరు ఎంపిక చేయాలి.


మీ అప్లికేషన్ నంబర్ లేదా డీమ్యాట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ నంబర్ ఎంటర్ చేయాలి.


సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీకు షేర్లు అలాట్ అయ్యాయో లేదో స్క్రీన్ పై కనిపిస్తుంది.


బీఎస్ఈ వెబ్‌సైట్‌ ద్వారా..


బాంబే స్టాక్ ఎక్స్చేంజీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మమత మెషినరీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బీఎస్ఈ వెబ్‌సైట్లో ఇన్వెస్టర్స్ సెక్షన్లోకి వెళ్లాలి. అందులోని అప్లికేషన్ స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇష్యూ టైప్ వద్ద ఈక్విటీ సెలెక్ట్ చేయాలి. ఇష్యూ నేమ్ దగ్గర మతమ మెషినరీ కంపెనీ పేరు ఎంచుకోవాలి. అప్లికేషన్ నంబర్ లేదా పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ కరెక్టుగా ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీకు షేర్లు అలాట్ అయ్యాయో లేదో స్క్రీన్ పై కనిపిస్తుంది. అయితే, భారీగా సబ్‌స్క్రైబ్ అయిన క్రమంలో అలాట్మెంట్ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈరోజు అర్ధరాత్రి లేదా బుధవారం షేర్ల కేటాయింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


లేటెస్ట్ జీఎంపీ ఎంత


మమత మెషినరీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం మంగళవారం నాటికి రూ. 260 వద్ద ఉంది. ఇష్యూ ధర రూ. 243 కంటే రూ. 260 అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దీని అర్థం. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రూ. 503 వద్ద ఈ షేర్లు లిస్ట్ కావచ్చని అంచనా. ఇది 107 శాతం లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని సూచిస్తోంది. అయితే జీఎంపీ రోజు రోజుకు మారుతుంది. లిస్టింగ్ నాటికి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com