అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) 2025ను కృత్రిమ మేధ (AI) సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం.
విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు కృత్రిమ మేధ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని 14 వేల విద్యాసంస్థలకు AICTE లేఖ రాసింది.