అనంతపురంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఫిర్యాదుతో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సహా 16 మంది పోలీసులు కేసులు పెట్టారు. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని పచ్చ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇదే సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కేసులు పెట్టారు.