విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత్ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 వేల మంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఆఫ్‌లైన్ ద్వారా 3000ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు.
విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, రెండవది అమరావతి అనిఅన్నారు. జనవరి 5న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే దానికి ఏ విధంగా డీపీఆర్‌వోలు తయారు చేయాలి అనేది అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10 వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని కేశినేని శివనాథ్ అన్నారు.