క్రికెటర్ నితీష్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అభినందించారు. నితీష్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులతో పంచుకున్న ఆనంద క్షణాలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా గుర్తుచేసుకున్నారు. కుటుంబసభ్యులతో పంచుకున్న వీడియోను భువనేశ్వరి పోస్ట్ చేశారు.
నితీష్ అద్భుత సెంచరీని చూసి తాము గర్విస్తున్నామని తెలిపారు. కుటుంబం గర్వపడేలా నితీష్ సంకల్ప విజయంతో వారి త్యాగాలకు ప్రతిఫలమిచ్చారని అన్నారు. నితీష్ తన కుటుంబాన్ని తెలుగు సమాజాన్ని గర్వించేలా చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు.. నితీష్ అధిరోహించాలంటూ నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.