క్రీడల అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించలేదని మండిపడ్డారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. ఏపీ ఆదాయం పెంచేందుకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.