మెల్‌బోర్న్ టెస్టులో ఇండియా దారుణ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బాక్సింగ్ డే టెస్టులో ఓటమి మానసిక ఆందోళన కలిగించిందన్నాడు. అనుకున్నది చేయలేనప్పుడు మానసిక సంఘర్షణ ఉంటుందని రోహిత్ తెలిపాడు.
బాక్సింగ్ డే టెస్టు నిరాశపరిచిందని, మ్యాచ్‌లు గెలిచేందుకు మార్గాలు ఉంటాయని, కానీ ఆమార్గాలను అన్వేషించలేకపోయామని రోహిత్ పేర్కొన్నాడు. చివర వరకు పోరాడాలని నిశ్చయించామని, కానీ దురదృష్టవశాత్తు అలా చేయలేకపోయినట్లు చెప్పాడు.