ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 04:23 PM

రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచించారు. అనంతపురం శ్రీనగర్‌ కాలనీ లో జరుగుతున్న తారు రోడ్డు పనులను ఆదివారం టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయాంలో నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉండే వన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారామ్‌, నెట్టెం బాలకృష్ణ, పీఎం లక్ష్మీప్రసాద్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నాయకులు ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com