టెక్కలిలోని మహిళా మండల సమాఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం రసాయన రహిత కూరగాయలను సిబ్బంది ప్రదర్శించారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగుచేసిన కూరగాయలు, ఆకుకూరలు, పూలను కార్యాలయ ఆవరణలో విక్రయించారు. రసాయనాలు లేకుండా పండించిన కూరగాయలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సిబ్బంది అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఉమారాణి, సిబ్బంది షణ్ముఖ, బాలకృష్ణ, అశోక్ ఉన్నారు.