వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు. కనగానపల్లి మండలం తూముచర్లకు చెందిన వసికేరప్ప, చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన అశ్వత్థరెడ్డి, ప్యాదిండికి చెందిన నరసింహులుకు ఆమె పంపిణీ చేశారు.
మరింత మంది రైతులకు అంద జేసేందుకు కృషి చేస్తామన్నారు. కాగా... గత కొన్నేళ్లుగా ఇలాంటి యంత్రాలు వస్తా యని ఆశించినా ఎవరూ ఇవ్వలేదని, తమకు యంత్రాలు ఇప్పించినందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.