కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రిసెప్షన్ కార్యాలయం, పశ్చిమరాజగోపురం దగ్గర కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుబ్బరావు తెలిపారు.
ఈ మేరకు భక్తులు దర్శనం టిక్కెట్లు, వ్రతాలు, విరాళాలు, వసతి సౌకర్యం కోసం ఇకపై డిజిటల్ పేమెంట్‌ల ద్వారా చెల్లింపులు చేయొచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.