అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్‌ని హార్ట్ బర్న్ కూడా అంటారు. ఇది సాధారణ జీర్ణ సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది వచ్చినప్పుడు నోటిలో పుల్లని రుచి ఉంటుంది. దీనికి కారణం.. కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం అన్నవాహికలోకి వచ్చి ఇది జరుగుతుంది. అధ్యయనాల ప్రకారం.. ఎసోఫాగియల్ స్పింక్టర్ సరిగ్గా మూసివేయబడనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. కడుపు సమస్యకి చాలా కారణాలే ఉంటాయి. ఈ సమస్యకి నిమ్మకాయతో చెక్ పెట్టొచ్చు. అదెలా అంటే..
నిమ్మకాయ..
యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకి ట్రీట్‌మెంట్ చేయకుండా వదిలేస్తే అది కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ కోసం ఇంటి నివారణలు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మన వంటగదిలోని ఎన్నో దినుసులు అసిడిటీకి ఇంటి నివారణగా వాడతారు. అందులో నిమ్మరసం కూడా ఒకటి.
గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్‌ని ఎలా తగ్గించుకోవాలి..
గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి డాక్టర్స్ ఎలా టెస్ట్ చేస్తారు..
కారణాలు..
యాసిడ్ రిఫ్లక్స్‌కి అనేక కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, ఎక్కువగా నూనె, స్పైసీ ఫుడ్స్ తినడం, ధూమపానం వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటితో పాటు.. కొన్ని మందులు కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ని పెంచుతాయి.
లక్షణాలు..
గొంతులో మంట, కడుపు పైభాగంలో ఇబ్బంది, అసిడిటీ, నాలుక మరియు గొంతులో నొప్పి, కడుపులో గ్యాస్ ఎక్కవగా ఏర్పడడం, ఛాతీలో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటివి అసిడిటీ సమస్యకి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు మళ్లీ మళ్లీ వస్తే డాక్టర్‌ని కలవడం మంచిది. మీరు యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తే.. నోటి వెనుక భాగంలో పుల్లని, చేదు రుచిని ఉంటుంది.
నిమ్మరసంతో లాభాలు..
నిమ్మరసం తీసుకోవడం వల్ల అనేక పొట్ట సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించుకోవడానికి సాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సాయపడుతుంది. దీని ద్వారా అసిడిటీ సమస్యని నివారిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో నిమ్మకాయ నీటిని తీసుకోవడం మంచిది.
ఎలా వాడాలి..
ఈ సమస్యని తగ్గించుకునేందకు, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి.. భోజనానికి 20 నిమిషాల ముందు నిమ్మరసం తాగాలి. కాబట్టి, దీనిని తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించొచ్చు. ఇది మీ ఆహారం సరిగ్గా, త్వరగా జీర్ణమవ్వడానికి సాయపడుతుంది.
ఎలా తయారు చేయాలి..
ఓ గ్లాసు నీటిలో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా అల్లం రసం, నల్ల ఉప్పు కలపాలి. ఈ పదార్థాలన్నీ మీ జీర్ణక్రియకి మంచివి. వీటిని తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. రెగ్యులర్‌గా ఈ డ్రింక్‌ని తాగడం మంచిది.