శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,70,66,162 ఆదాయం వచ్చింది.
వీటితో పాటు 210 గ్రాముల బంగారం, 11.240 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు దేవస్థానం EO రామారావు తెలిపారు.