జర్మనీలో ఆల్టర్నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్ పార్టీకి మద్దతు పెరుగుతోందని ఎలాన్ మస్క్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. దీంతో మస్క్ వ్యాఖ్యలకు స్పందించిన జర్మన్ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్.. మస్క్ పేరు ప్రస్తావించకుండానే అవకతవకలను నిరోధించి.
ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని, ఎవరు గెలుస్తారో సోషల్‌మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 23న జరిగే ఎన్నికల్లో జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఒలాఫ్ పేర్కొన్నారు.