వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి ఘటనలకు సూత్రధారిగా కాళీని పోలీసులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది కార్యకర్తలు అరెస్టయి రిమాండ్ లో ఉన్నారు. పరారీలో ఉన్న కాళీని అసోంలో గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. కాళీ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.