మచ్చలు లేని అందమైన, మృదువైన చర్మం కావాలని అందరికీ ఉంటుంది. కానీ, రోజంతా ఎండలో బయట తిరగడం, సరిలేని లైఫ్‌స్టైల్ ఇతర కారణాల వల్ల ముఖంపై పిగ్మంటేషన్ మొదలవుతుంది. దీనిని దూరం చేసేందుకు కొంతమంది క్రీమ్స్, లోషన్స్ వాడతారు. అయినా రిజల్ట్ అంతలా ఉండదు. అలా కాకుండా ఇంట్లోనే తయారుచేసే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌తో ఈ పిగ్మంటేషన్‌ని దూరం చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకోండి.
ఎర్రకందిపప్పు
చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఎర్ర కందిపప్పు బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పులో అంతే పరిమాణంలో పాలు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఇందులో కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టండి. తర్వాత దీనిని స్కిన్‌కి అప్ల చేయండి. ఆరిన తర్వాత స్క్రబ్ చేస్తూ క్లీన్ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే మంగు మచ్చలు మాయం.
బొప్పాయితో
బొప్పాయిలోనూ ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. దీంతోపాటు నేచురల్ బ్రైటెనింగ్ గుణాలు ఉన్నాయి. బొప్పాయి రసం ముఖానికి అప్లై చేస్తే నల్లని మచ్చలు, మంగు మచ్చలు దూరమవుతాయి. దీనిని మంగు మచ్చల్ని దూరం చేసేందుకు ఎలా వాడాలంటే 4, 5 బాగా పండిన బొప్పాయి ముక్కల్ని తీసుకోవాలి. ఇందులో కొద్ది బంగాళాదుంప రసం, దోసకాయ గుజ్జు వేయాలి, అందులోనే వాటర్ మెలన్ గుజ్జు కూడా వేయాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టాలి. 15 నిమిషాల తీసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇందులోని గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి.
శనగపిండితో
శనగపిండి చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిపించేందుకు హెల్ప్ చేస్తుంది. దీనిలో పసుపు కలిసినప్పుడు ముఖంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి. శనగపిండిలో కొద్దిగా పసుపు వేసి పేస్టులా చేసేందుకు పెరుగు వేసి కలపండి. ఇది మొత్తం పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల పాటు ఉండి తర్వాత రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉండే మంగు మచ్చలు తగ్గుతాయి.
నిమ్మరసం, తేనె
నిమ్మరసంలో నేచురల్ బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మొండి ట్యాన్ మచ్చల్ని దూరం చేస్తాయి. దీనికోసం ఓ గిన్నెలో తాజా నిమ్మరసం తీసుకోండి. అందులోనే కొద్దిగా తేనె వేయండి. దీనిని బాగా కలపండి. దీనిని మీ ముఖంపైనున్న మచ్చలపై రాయండి. ఆరేంత వరకూ ఉండండి. తర్వాత నీటితో క్లీన్ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే కచ్చితంగా ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.
కాఫీ పొడితో
కాఫీలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాుల ఉన్నాయి. దీనిని వాడడం వల్ల యాన్నే దూరమవుతుంది. దీంతో ప్యాక్ వేసుకోవాలి. అదెలా అంటే.. కాఫీ పౌడర్‌లో కొద్దిగా కొబ్బరినూనె, కొంచెం పంచదార పొడి వేసి కలపాలి. దీనిని మొత్తం స్క్రబ్‌లా చేయాలి. ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత మెల్లిగా మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. రెగ్యులర్‌గా చేస్తే మచ్చలు మాయం.