దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వైరస్ ఆందోళనల మధ్య సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు ఇవాళ లాభాల బాట పడ్డాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 23,700 ఎగువన ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 423 పాయింట్లు పెరిగి 41,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 23,753 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.78 వద్ద కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa