ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారని ఇప్పటికే నార్వే, బ్రిటన్ దేశాధినేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు.
ఇమ్మానుయేల్ మేక్రాన్ కూడా అదే వ్యాఖ్యలు చేయడంతో.. వాటిని మస్క్ తోసిపుచ్చు కొచ్చారు. అమెరికా ఎన్నికలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభావితం చేయాలని చూశారని, డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా తన పార్టీ సభ్యులను మోహరించారని మస్క్ విమర్శించారు.