అస్సాం దిమా హసావ్ జిల్లాలోని బొగ్గు గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
కాగా, అందులో ముగ్గురు చనిపోయినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. డైవర్స్, హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం.