ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందట. అంతేకాకుండా కాఫీ ఆకలిని కూడా చంపేస్తుంది.
కాఫీలో ఉండే కెఫీన్ గుండె సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బదులునగా పరిగడుపున పండ్లు తింటే మంచిదని సూచిస్తున్నారు.