రేపు ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. సభలో అల్లర్లు చేస్తారని ముందస్తు సమాచారంతో బొబ్బిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం బొబ్బిలి పట్టణం ఐటిఐ కాలనీలో ఉంటున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణకు పోలీసులు నోటీసు అందించారు. మోడీ సభలో అల్లర్లు చేస్తారని ముందస్తు సమాచారంతో నోటీసులు ఇచ్చినట్లు ఎస్ఐ రమేష్ అన్నారు. పోలీసుల చర్యను రమణ ఖండించారు.