పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్దేశించిన అన్ని చెరువులకు నీరు అందించాల్సిందేనని ఎమ్మెల్యే పరి టాల సునీత ఇరిగేషన అధికారులను ఆదేశించారు. రాప్తాడు మండలంలోని గోళ్లపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం ధర్మవరం నియో జకవర్గంలోని చివరి చెరువుకు నీరు అందిస్తున్న నేపథ్యంలో కాలువలో నీటివేగం తగ్గిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మె ల్యే అధికారులకు ఫోన చేసి మాట్లాడారు. ప్రస్తుతం తాడిమర్రి మండ లంలోని చివరి చెరువుకు నీరందిస్తున్నారు. అయితే నీటి వేగం తగ్గడంపై అధికారులతో ఆరాతీశారు. ధర్మవరం నియో జకవ ర్గంలోని చెరువులకు వెళ్లే నీటి ప్రవాహం తగ్గితే ఇంక రాప్తాడు నియోజ కవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రా ప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో కుడి కాలువ పరిధిలోని అన్ని చెరు వులకు నీరు ఇవ్వా ల్సిందేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇన చార్జ్ ధర్మవరపు మురళి, మండల కన్వీనర్ కొండప్ప, రైతులు పాల్గొన్నారు.