ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.
అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కీలక హామీ ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని తెలిపారు.