మలేరియా కారక దోమలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా జన్యు శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగానికి తెర తీశారు. మగ దోమల వీర్యాన్ని విషతుల్యం చేసి, మలేరియా కారక ఆడ దోమలను నివారించే ప్రయత్నం మొదలు పెట్టారు.
మగ దోమల వీర్యాన్ని విష తుల్యం చేస్తే, అవి ఆడ దోమలతో సంభోగం జరిపినప్పుడు ఆడ దోమలు చనిపోవడం లేదా మలేరియా కారక కణాలను కోల్పోవడం జరుగుతుంది.