ఢిల్లీ సీఎం ఆతిశీ నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అధికారిక బంగ్లాలో లగ్జరీ సౌకర్యాల కోసం అత్యధికంగా నిధులు ఖర్చుచేశారని బీజేపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ‘నిజాన్ని చూపిస్తాం’ అంటూ బంగ్లాలోకి వెళ్తుండగా.. ఆప్ సీనియర్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.