కొంతమంది అమ్మాయిలు నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి.. వంటి శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.పొడి దగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. లేదంటే రోజూ ఓ చిన్న బెల్లం ముక్క తిన్నా ఈ సమస్యల నుంచి విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు.తరచుగా పొడి దగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయంటున్నారు నిపుణులు.మైగ్రెయిన్ బాధిస్తుంటే బెల్లం, నెయ్యి.. ఈ రెండింటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.