తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని.. ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ..‘‘రాష్ట్రం బయట వున్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు.
ఇతరరాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లూ నేర్చుకుంటున్నారు. తెలుగు వారు అమ్మ భాష మాట్లాడటం లేదు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్టేనన్నారు’’ అని పిలుపునిచ్చారు.