ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

business |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 02:15 PM

ఎవరైనా సరే కొత్త కారు కొనాలనుకున్నప్పుడు మంచి మైలేజీతో కూడిన చవకైన కారును దక్కించుకోవాలని కోరుకుంటారు. హ్యాచ్బ్యాక్ విభాగంలో రెండు ప్రసిద్ధ కార్లు మారుతి సెలెరియో, టాటా టియాగో భారత మార్కెట్లో ఉన్నాయి.ఇవి పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రెయిన్లతో వస్తాయి. అంతేకాకుండా ఇవి అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి. ఇప్పుడు ఈ రెండు కార్లలో ఏది కొనాలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెండు కార్ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.భారతీయ మార్కెట్లో మారుతి సెలెరియో ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.36 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.04 లక్షల వరకు ఉంటుంది. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ. ఐదు లక్షల నుంచి రూ. ఏడు లక్షల మధ్యలో ఉంటుంది. ఇది ఆరు వేరియంట్లలో లభిస్తుంది.


మారుతి సెలెరియో ఇంజిన్ ఎలా ఉంది?
ఈ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం పీక్ టార్క్ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంటుంది. దీని సీఎన్జీ వెర్షన్లో ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే వస్తుంది. ఇది 56.7 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది. దీనిలో 60 లీటర్ సీఎన్జీ ట్యాంక్ అందుబాటులో ఉంది.మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా సీఎన్జీ వేరియంట్ కిలోగ్రాముకు దాదాపు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఏడు అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏసీ వెంట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.


 


టాటా టియాగో ఇంజిన్ ఎలా ఉంది?
టాటా టియాగో హ్యాచ్బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు సీఎన్జీ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని పెట్రోల్ మోడల్ 20 కిలోమీటర్లు కాగా, సీఎన్జీ మోడల్ 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో మీరు ఐదుగురికి సీటింగ్ అరేంజ్మెంట్ అందిస్తారు. కారు ఇంజిన్ గురించి చెప్పాలంటే కారు 1.2 లీటర్ ఇంజిన్ను కలిగి ఉంది. ఇది సీఎన్జీ మోడ్లో 73 హెచ్పీ పవర్, 95 ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ అందిస్తారు.టియాగోలో ఏడు అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సౌకర్యం ఉంది. దీంతో పాటు 242 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది. సెక్యూరిటీ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ ఎయిర్బ్యాగులు, ఈబీడీతో ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్తో టీఎంపీఎస్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com