శీతాకాలంలో ప్రజలు ఎక్కువగా సీజనల్ వ్యాధుల బారినపడుతుంటారు. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి వెంటాడుతుంటాయి. అయితే, ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే..శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.ఇందుకోసం మందపాటి దుస్తులు వేసుకుంటే సరిపోదు. శరీరానికి అంతర్గతంగా కూడా వేడిని అందించాల్సిన అవసరం ఉంది. దీని కోసం, నువ్వులు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని లోపల నుంచి వేడిగా మారుస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో తెల్ల నువ్వులను చలికాలంలో కచ్చితంగా చేర్చుకోవాలి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది.బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. అదే సమయంలో, నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో నువ్వులు, బెల్లం మిశ్రమం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది తగినంత మొత్తంలో ఫైబర్‌ను అందిస్తుంది. దాంతో జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిలోనూ ఐరన్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. నువ్వులు, బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నువ్వులలో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను తింటే మేలు జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహించి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టులో మెరుపును కాపాడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.