‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ మరణించిన విషయం తెలిసిందే.
రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈక్రమంలో తాజాగా పిఠాపురం పర్యటనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్..ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని పవన్ ఆరా తీశారు.