తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం కానుంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఇందులో చర్చించనున్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి వీటిని పంపిణీ చేసే విషయమై సమాలోచనలు చేయనున్నారు.