దేశ వ్యాప్తంగా జీఎస్టీ సర్వర్ డౌన్ అయింది. దీంతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నట్లు పన్ను చెల్లింపుదారులు అంటున్నారు. 24 గంటల నుంచి సర్వర్ పూర్తిగా పని చేయడంలేదని వాపోతున్నారు.
ఇందుకు సంబంధించి GST కూడా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. కొన్ని సాంకేతిక కారణాలతో సర్వర్ పని చేయడంలేదని పేర్కొన్నది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.