ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ - రాజమండ్రి మధ్య ప్రమాదస్థలిని సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 03:13 PM

గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23), చరణ్ (22) రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన కాకినాడ - రాజమండ్రి మధ్య ప్రమాదస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించారు.ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురంకు వెళుతున్న పవన్ మార్గమధ్యంలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈనెల 4న రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు జనసేన తరపున రూ. 5 లక్షల చొప్పున పవన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ కూడా రూ. 5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com