తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ‘‘స్పృహ తప్పిన మహిళను బయటకు తీసుకెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది చెప్పారు.
టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడ్డారు. ఒకవైపు తెరవాల్సిన గేట్లు.. మరోవైపు తెరవడంతో తొక్కిసలాట జరిగినట్లు చాలామంది తెలిపారు’’ అని మంత్రి వివరించారు.