బీజేపీ పార్టికి 25ఏళ్లుగా ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే, ఇక్కడి ప్రజల పట్ల ఆ పార్టీ ద్వేషం పెంచుకుందని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
అందుకే ఢిల్లీని ‘భారత దేశానికి నేర రాజధాని’గా మార్చారని అన్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్‌వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారని ఆరోపణలు చేశారు.