లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ రెస్టారెంట్ లో స్వయంగా మిల్క్ షేక్ తయారుచేసి కస్టమర్ కు అందించారు. పాల ఉత్పత్తులు, మిల్క్ షేక్ ల తయారీలో పేరొందిన కెవెంటర్స్ స్టోర్ ను రాహుల్ గాంధీ గురువారం సందర్శించారు. ఢిల్లీలోని ఓ స్టోర్ ను సందర్శించిన రాహుల్ కు.. స్టోర్ సిబ్బంది మిల్క్ షేక్ ల తయారీ గురించి వివరించారు. ఆపై ప్రత్యక్షంగా చేసి చూపించేందుకు ప్రయత్నించగా.. సిబ్బందిని అడ్డుకుని తానే చేస్తానని రాహుల్ ముందుకొచ్చారు. స్టోర్ సిబ్బంది సూచనలతో మిల్క్ షేక్ తయారుచేసి కస్టమర్ కు అందించారు. కెవెంటర్స్ సంస్థ ఇటీవలే వందేళ్లు పూర్తిచేసుకుంది.. ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యంతో ముచ్చటించారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.