పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో రాజ్యాంగంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను మంత్రి అమిత్‌షా అవమానించడం రాజ్యాంగ ఉల్లంఘన చర్యగా భావించి తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముమ్మిడివరంలోని జైబుద్ధ పార్కులో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్టుమెంటు జిల్లా చైర్మన్ వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన పార్టీ సమావేశంలో వక్తలు మాట్లాడారు. పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేయాలని, అమిత్‌షాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రాన్ని అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్ద ఉంచారు. అనంతరం ర్యాలీగా తరలివెళ్లి నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ పి.రవివర్మకు వినతిపత్రం అందించారు. దీనిపై కమిషనర్ రాష్ట్రపతికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలెపు ధర్మారావు, దివి వెంకటేశ్వరరావు, మల్లాడి గోపి, గోడి భాస్కరరావు, పెయ్యల చంటిబాబు, కాశి అచ్యుతరామయ్య, మెండి కొండబాబు, మెండి రాజశేఖర్, మెల్లం శ్రీరాములు పాల్గొన్నారు.