నంద్యాల జిల్లాలో శుక్రవారం జరిగే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైష్ణవ ఆలయాల్లో ఆయా కమిటీలు, ఈవోల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లు, ఉత్తర ద్వారదర్శనం ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉదయం 5గంటలనుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా పలు రకాలు పళ్లు, కూరగాయలు, పూలు, అరటి తోరణాలు, విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. నంద్యాల పట్టణంలో గుడిపాటి గడ్డలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయం, సంజీవనగర్ లోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్ధానం, మూలసాగరంలోని వెంకటేశ్వరస్వామి దేవస్దానం, తెలుగుపేటలో వెలసిన మద్దులేటి స్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు.