మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. పుట్టినరోజు పార్టీకి వెళుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక తన బంధువు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు యువకులు కలిసి బలవంతంగా కారులోకి ఎక్కించుకుని.. చెరువు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.