విజయవాడలోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ అధికారులు భారీగా స్మగ్లింగ్ బంగారాన్ని పటుకున్నారు. 16 మంది నుంచి 17.90 కిలోల విదేశీ బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ రూ.14.37 కోట్లు ఉంటుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్లు, బొల్లపల్లి టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వారిని విశాఖపట్నంలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది.