కృష్ణా జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఎంపీ బాలసౌరి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా పంగడ నిర్వహించుకోవాలని చెప్పారు. అందరి జీవితాల్లో ఈ సంక్రాంతి వెలుగు నింపాలని దేవుణ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడింకి పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకోవడంతో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా సీఎస్సార్ నిధులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు.