బ్రిజేష్ ట్రైబ్యునల్ కృష్ణానది మిగులు జలాలు వాడుకోవడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. దానిని సుప్రీం కోర్టులో అడ్డుకుని నేను స్టే తెచ్చాను. ఎగువ రాష్ర్టాలు కర్ణాటక, మహారాష్ట్ర దయ తలిస్తే తప్ప ఏపీ, తెలంగాణకు నీళ్లు రావు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు కట్టి ఉపయోగం ఏంటి? ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ నీటి వనరుల కోసం కలిసి పోరాటం చేయాలి.’ అని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రులు ఛత్తీ్‌సగఢ్, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడాలని, రెండుచోట్లా బీజేపీ ప్రభుత్వాలు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం 371డీ గురిం చీ మాట్లాడుకోవాలని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిపై చర్చ జరగాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చర్చ జరగడానికి ఇలాంటి ఆత్మీయ కలయికలు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని, పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని సీపీఐ రాష్ట నాయకుడు రామకృష్ణ సూచించారు. అమరావతి కొత్త ప్రభుత్వ హయాంలో పూర్తవుతుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే కృష్ణాడెల్టాపైన దృష్టి సారించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. నీటి కొరత రాకుండా, నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు. అత్మీయ కలయిక నిర్వహిస్తున్న కృష్ణారావు ఆలోచనలప్రకారం కలయికలో పాల్గొంటున్న సమాజంలో వివిధ రంగాల ప్రముఖులు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు అందరి ఆమోదంతో ప్రభుత్వాలకు పంపాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచిం చారు. ప్రత్యేక హోదా, హామీల సాధనకు అందరం కలిసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలని సీపీఐ లిబరేషన్ నాయకుడు హరినాథ్ పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐ కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వాలు కూడా ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దేశ ప్రగతిలో కీలకంగా ఉండే రైతుల రక్షణకు చట్టాలు లేవని, అదే ఒక కంపెనీలో పని చేసే చిరుఉద్యోగికి పీఎఫ్, ఈఎ్‌సఐ, పెన్షన్ వంటి సౌకర్యాలు ఉంటాయని, ఈ పరిస్థితి మారాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు వీవీ కృష్ణారావు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా అక్కడి నుంచే వెబ్‌క్యాస్టింగ్ ద్వారా మాట్లాడారు. సంక్షేమ రాజ్యం అంటే సక్రమంగా పన్నులు వసూలు చేసి సక్రమంగా ఖర్చు చేయడమన్నారు. పథకాల పేరుతో పంచడం కాదన్నారు. మానవ హక్కుల నా యకుడు ఆంజనేయులు, రైతు సంఘం నాయకుడు అక్కినేని భవానీప్ర సాద్, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, వైసీపీ నాయకులు న్యాయవాది రాజిరెడ్డి, మాజీ ఐఏఎస్ అఽధికారి బలరామయ్య మాట్లాడారు. కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది పదిరి రవితేజ నిర్వహించారు. ఆత్మీయకలయికలో నగరంలోని ప్రముఖులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa