AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా.. ‘భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలు తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. పవిత్రమైన ఈ పండుగ అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి. మీ అందరికీ మరోసా పండగ శుభాకాంక్షలు.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.