ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో శ్రీ రామాంజనేయ భజన బృందం ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం నగర సంకీర్తన నిర్వహించారు.
ధనుర్మాసం మొదలు నుండి భోగి పండుగ వరకు రోజూ తెల్లవారుజామున 5 గంటల నుండి రామాలయం వద్ద నుంచి భక్తుల భజనలతో గ్రామ పురవీధుల్లో మేలుకొలుపుని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు.