విద్యుత్ చార్జీలు పెంపుకు నిరసనగా సిపిఎం నాయకులు కార్యకర్తలు ఆదివారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. అచ్యుతాపురం మండల సిపిఎం కార్యదర్శి ఆర్ రాము ఆధ్వర్యంలో మండలంలో తిమ్మరాజుపేట గ్రామంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై రూ. 1800 కోట్ల భారం మోపారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa