రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'నో హెల్మెట్ నో ఫ్యూయల్' విధానానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్రవాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పెట్రోల్‌ను విక్రయించకూడదని అన్ని పెట్రోల్ బంక్‌లకు నోటీసులు ఇచ్చింది. కాగా, ద్విచక్రవాహనం వెనుక సీటులో కూర్చునే వారికి సైతం నిబంధనలు వర్తించనున్నాయి.