యూపీలో మహా కుంభమేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ ఆధ్మాత్మిక కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే వివాదం చెలరేగింది. మహా కుంభమేళా ప్రాంతంలో ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవాసంస్థాన్ ఆధ్వర్యంలో ఓ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆందోళన చేపట్టింది. హిందూ, సనాతన ధర్మ వ్యతిరేకి అయిన ములాయం సింగ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.