ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 02:57 PM

 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే… దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.‘సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను లోగిళ్లకు మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ హృదయపూర్వకి శుభాకంక్షలు అని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌.. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సరదాల సక్రాంతి, అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి.. ఇది ప్రజలకు ఈ పండగపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది.. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంత వరకు పలుచడడ్డాయి.. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది.. పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం.. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షింగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన ప్రకటన లో పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com