పరగడుపున ఖాళీ కడుపుతో పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పాలు తాగడం వల్ల గ్యాస్, వాంతులు వంటి సమస్యలు దూరమవుతాయి. పొద్దున్నే పాలు తాగడం వల్ల ఆకలి వేయదు. దీంతో జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. పాలలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇంకా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీరంలోని అవయవాలన్నిటికీ సరిపడా శక్తి చేకూరుతుంది.